కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో వెట్టి చాకిరీ:
నవంబర్‌లో 3.5 లక్షల మందితో భారీ ఉద్యమం: ఏపీ కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ జేఏసీ రణభేరి సదస్సులో హెచ్చరిక ప్రజా సంక్షేమం న్యూస్-గుంటూరు: గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారని, ఇకపై ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని ఏపీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అండ్ టీచర్స్ జేఏసీ స్పష్టం చేసింది. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకపోతే వచ్చే నవంబర్‌లో రాష్ట్రంలోని 3.5 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో భారీ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది.జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రాంతీయ సదస్సుల్లో...