కుట్ర ప్రకారమే గౌరవ స్పీకర్‌ను అవమానించే ప్రయత్నాలు: ప్రభుత్వ విప్,నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం

ప్రజాసంక్షేమం న్యూస్: శాసనసభ స్పీకర్‌పై బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రభుత్వ విప్,నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నేడు యావత్ తెలంగాణ సమాజంతో పాటు ముఖ్యంగా దళిత సమాజం బాధతో అసెంబ్లీ వైపు చూస్తోందని అన్నారు.గత పది సంవత్సరాల పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు.గతంలో శ్రీ భట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా ఆయనను అవమానించారని గుర్తు చేశారు.ప్రస్తుతం ఒక కుట్ర ప్రకారమే గౌరవ...