32 వేల మంది యువత హాజరు..350 కంపెనీల్లో ఇంటర్వ్యూలు..
5,720 మందికి ఉద్యోగ అవకాశాలు…
ప్రజాసంక్షేమం న్యూస్-కోదాడ:
కోదాడలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ఘనవిజయం సాధించిందని.రిజిస్ట్రేషన్ చేసుకున్న వారితో పాటు రిజిస్ట్రేషన్ చేసుకోని వారిని కలిపి దాదాపు 32,000 మంది నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాకు హాజరయ్యారని.హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 350 ప్రముఖ కంపెనీలు పాల్గొని యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించాయని.ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ జాబ్ మేళా ద్వారా సుమారు 5,720 మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని.గ్రామీణ ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఒకే వేదికపై ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడం సంతృప్తినిచ్చిందని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని సందర్శించి యువతను ప్రోత్సహించిన శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్,శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి,మంత్రులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు,శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే కార్యక్రమానికి సహకరించిన ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఇతర ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి నాయకత్వానికి, నిరంతర కృషికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.జిల్లా కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవార్,ఐఏఎస్,జిల్లా ఎస్పీ శ్రీ నరసింహ,ఐపీఎస్,పరిశ్రమల శాఖ,సింగరేణి సంస్థ,టాస్క్,ఆర్గనైజింగ్ కమిటీ,పాల్గొన్న కంపెనీలు,అధికారులు,విద్యాసంస్థలు,వాలంటీర్లు తదితరులు జాబ్ మేళా విజయవంతం కోసం రాత్రింబవళ్లు కృషి చేశారు.సమష్టి కృషితో వేలాది కుటుంబాల ఉజ్వల భవిష్యత్తుకు ఉద్యోగ అవకాశాల రూపంలో కొత్త ద్వారాలు తెరుచుకున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు.