ఖేలో తెలంగాణ.. నిరంతర క్రీడా ఉద్యమానికి శ్రీకారం:క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
ప్రజల ఆరోగ్యం.. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి 9+9+9 ఫిట్‌నెస్ ఛాలెంజ్‌కు రూపకల్పన వివిధ క్రీడాంశాల్లో లీగ్ పోటీలకు ప్రోత్సాహం ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్, సెప్టెంబర్ 22: తెలంగాణలో క్రీడా సంస్కృతిని మరింత విస్తృతం చేయడంతో పాటు, శారీరక చైతన్యాన్ని ప్రజల దైనందిన జీవితంలో భాగం చేయడం లక్ష్యంగా “ఖేలో తెలంగాణ” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ క్రీడా శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిరంతర క్రీడా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణరూపొందిస్తున్నారు.సచివాలయంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి...