ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం విజయవంతం.
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర, నిమజ్జన ఘట్టం అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.ఈ మహోత్సవాన్ని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు రాత్రింబవళ్లు అంకితభావంతో విధులు నిర్వర్తించిన ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్ అధికారులు, సిబ్బందికి అభినందనలు.ఉత్సవాల ప్రారంభం నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు పోలీసు యంత్రాంగానికి సంపూర్ణ సహకారం అందించిన నగర ప్రజలు, భక్తులు, ఉత్సవ నిర్వాహకులకు ప్రజా సంక్షేమం న్యూస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. — ప్రజా సంక్షేమం న్యూస్ ప్రజల కోసం... ప్రజల గొంతుకగా...