PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 5:47 pm Posted by : Praja Sankshemam News

గంగోరిగూడెంలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం చేతుల మీదుగా ప్రారంభం
పంచాయతీ కార్యకలాపాలకు భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలి
మునుగోడు, సెప్టెంబర్ 29 (ప్రజా సంక్షేమం న్యూస్ ప్రతినిధి):

మునుగోడు మండల పరిధిలోని గంగోరిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా నూతన భవనాన్ని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామపంచాయతీకి సంబంధించిన పరిపాలనా కార్యకలాపాలకు భవనాన్ని పూర్తిస్థాయిలోవినియోగించుకునేలా అవసరమైన సదుపాయాలను సమకూర్చుకోవాలని సూచించారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పంచాయతీ కార్యాలయం పనిచేయాలని తెలిపారు.కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.