PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 4:22 pm Posted by : Praja Sankshemam News

గచ్చిబౌలిలో మన్మోహన్ సింగ్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు:

విప్రో సర్కిల్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన నేతలు..
ఆర్థిక సంస్కరణల రూపశిల్పికి ఘన నివాళి..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర చారిత్రాత్మకం..
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (ప్రజా సంక్షేమం న్యూస్):

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్‌లో విప్రో సర్కిల్ వద్ద రేపు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జరగనున్న భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారత ఆర్థిక ప్రగతికి దిశానిర్దేశం చేసిన మహోన్నత ఆర్థికవేత్తగా పేర్కొన్నారు.1991లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులకు దోహదపడ్డాయని తెలిపారు. ప్రధానమంత్రిగా దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పార్లమెంట్ సభ్యుడిగా ఆయన మార్గదర్శకత్వంలో పనిచేసే అవకాశం లభించడం తన ప్రజా జీవితంలో ఎంతో గర్వకారణమని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన అందించిన సహకారం, మార్గదర్శకత్వాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర:
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పాత్ర చారిత్రాత్మకమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అనంతరం సాగిన ప్రక్రియలో ఆయన నాయకత్వం కీలకంగా నిలిచిందన్నారు.గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన సేవలను స్మరించుకోవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని తెలిపారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి తగిన గౌరవం అందించేలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని అభినందించారు.