PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 12:01 am Posted by : Praja Sankshemam News

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో రక్తదాన శిబిరం!

భక్తితో పాటు సేవాభావం పెంపొందించడమే లక్ష్యం: ఛత్రపతి శివాజీ యూత్
ప్రజాసంక్షేమం న్యూస్-నల్గొండ,సెప్టెంబర్19
:శ్రీశ్రీశ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నల్గొండ పట్టణంలోని 42వ డివిజన్ గొల్లగూడలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వినాయక మండపం వద్ద నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.భక్తి భావంతో పాటు ప్రజల్లో సేవాభావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో వినాయక మండపం వద్ద తొలిసారిగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.రక్తదానం చేసి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క రక్తదాతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.భక్తి కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టడం ద్వారా సమాజానికి సేవ చేయాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరింత మంది సేవాభావంతో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరారు.
ఛత్రపతి శివాజీ యూత్ కమిటీ సభ్యులు:అల్లి నాగలక్ష్మి మల్లికార్జున్ యాదవ్ (42వ డివిజన్ కార్పొరేటర్),జక్కల మహేష్ యాదవ్,పెంబర్ల శ్రవణ్ యాదవ్,దూదిమెట్ల సాయికుమార్ యాదవ్ (ఆపత్బంధవ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్),మొగుళ్ల తేజ గౌడ్,బెజవాడ అంజి గౌడ్, సముద్రాల శంకర్ గౌడ్,సముద్రాల మల్లికార్జున్ గౌడ్,సింగం గంగరాజు యాదవ్,కొల్లు అఖిల్ గౌడ్,సముద్రాల మధు, కుంచం శీను,జక్కల విజయ్ యాదవ్, ముక్కముల నాగరాజు యాదవ్,జక్కల నరేష్ యాదవ్, కర్నే మల్లికార్జున్, కర్నె కార్తీక్, కర్నే గణేష్, కర్నె శివ, కర్నె వీరయ్య, సముద్రాల వెంకన్న, నాంపల్లి సంతోష్, బాజ అరుణ్ కుమార్ (ఆపత్బంధవ్ ఫౌండేషన్ జాయింట్ సెక్రటరీ), జెర్రిపోతుల వినయ్ (ఆపత్బంధవ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్), రాజు (రక్షా బ్లడ్ బ్యాంక్), చింత సైదులు తదితరులు పాల్గొన్నారు.