గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో రక్తదాన శిబిరం!
భక్తితో పాటు సేవాభావం పెంపొందించడమే లక్ష్యం: ఛత్రపతి శివాజీ యూత్ ప్రజాసంక్షేమం న్యూస్-నల్గొండ,సెప్టెంబర్19:శ్రీశ్రీశ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నల్గొండ పట్టణంలోని 42వ డివిజన్ గొల్లగూడలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వినాయక మండపం వద్ద నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.భక్తి భావంతో పాటు ప్రజల్లో సేవాభావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో వినాయక మండపం వద్ద తొలిసారిగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.రక్తదానం చేసి కార్యక్రమానికి సహకరించిన ప్రతి...