PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 12:45 pm Posted by : Praja Sankshemam News

గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు!

పెద్ద చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన సర్పంచ్ జేరిపోతుల భరత్ కుమార్
భక్తులకు ఇబ్బందులు లేకుండా క్రేన్, జేసీబీల ఏర్పాటు
నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా చర్యలు
ప్రజాసంక్షేమం న్యూస్ నార్కెట్‌పల్లి:
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నార్కెట్‌పల్లి పట్టణంలోని పెద్ద చెరువు వద్ద నిర్వహించనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నార్కెట్‌పల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జేరిపోతుల భరత్ కుమార్ పరిశీలించారు.నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు, క్రేన్,జేసీబీ తదితర వాహనాలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సర్పంచ్ సూచించారు.
భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా,నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శిరీష ప్రవీణ్ రెడ్డి,వార్డు సభ్యులు వడ్డేగోని రామలింగం, ఆమనగంటి అయిలయ్య, జిల్లా మహేష్, నాయకులు బషీర్, కార్యనిర్వహణ అధికారి రవి కుమార్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.