గబ్బిలాలపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా: ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంతో పాటు గబ్బిలాలపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (ఆరుట్ల మోడల్) ఏర్పాటు చేయాలని కోరుతూ తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.సమావేశంలో తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రాధేశ్యామ్ మాట్లాడుతూ గబ్బిలాలపేటలో పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించి,వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా భవన నిర్మాణం పూర్తి చేయాలని కోరారు.పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని సమావేశంలో పాల్గొన్న వారు...