గుంటిపల్లిలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువ కూలీ మృతి
11 కేవీ విద్యుత్ తీగ తెగిపడి ఉండటంతో ప్రమాదం పురుగుమందు పిచికారీ చేస్తుండగా ఘటన విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికుల ప్రజాసంక్షేమం న్యూస్ నిడమానూరు, సెప్టెంబర్ 27 (ప్రజాసంక్షేమం న్యూస్): నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం గుంటిపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నల్లగంతుల నాగరాజు (27) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. రోజూవారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నాగరాజు ప్రస్తుతం నల్లగొండ పట్టణంలో నివాసముంటున్నాడు. ప్రతిరోజూ పనుల కోసం తన స్వగ్రామమైన గుంటిపల్లికి వచ్చి...