PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 10:30 pm Posted by : Praja Sankshemam News

గురువులే భావితరాల బాటసారులు.. విద్యారంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత:మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
12 వేలకుపైగా ఉపాధ్యాయుల నియామకాలు పూర్తి
రూ.200 కోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం
ప్రజాసంక్షేమం న్యూస్-నల్గొండ:

జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంతో పాటు సమాజానికి సరైన దిశానిర్దేశం చేసేది గురువులేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ ఉపాధ్యాయ నియామకాలు చేపడుతోందని తెలిపారు. ఇప్పటికే 12 వేలకుపైగా ఉపాధ్యాయుల నియామకాలు పూర్తయ్యాయని,అవసరాన్ని బట్టి మరిన్ని పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లాలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ప్రభుత్వం శంకుస్థాపన చేసిన విషయం అధికారికంగా నమోదైంది. జిల్లాలో విద్యార్థుల నమోదు 9 శాతం పెరగడం ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమని పేర్కొంటూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విలువలు, నైపుణ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు మరింత అంకితభావంతో పనిచేయాలని కోరారు.