గురువులే భావితరాల బాటసారులు.. విద్యారంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత:మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం 12 వేలకుపైగా ఉపాధ్యాయుల నియామకాలు పూర్తి రూ.200 కోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం ప్రజాసంక్షేమం న్యూస్-నల్గొండ: జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్‌లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంతో పాటు సమాజానికి సరైన దిశానిర్దేశం చేసేది గురువులేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ ఉపాధ్యాయ నియామకాలు చేపడుతోందని తెలిపారు. ఇప్పటికే 12 వేలకుపైగా...