గ్రామసభల్లో ఎల్‌నినో యాక్షన్ ప్లాన్‌పై చర్చించాలి:పిఆర్ &ఆర్డి మినిస్టర్ సీతక్క

అత్యవసర గ్రామీణ పనులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి! పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష! ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్:పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఖైరతాబాద్‌లోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు,ఉపాధి హామీ పథకం,నీటి భద్రత తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.అక్టోబర్ 2న నిర్వహించనున్న గ్రామసభల్లో ఎల్‌నినో యాక్షన్ ప్లాన్‌పై విస్తృతంగా చర్చించాలని అధికారులను ఆదేశించారు.ప్రతి గ్రామంలో వాతావరణ పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలపై గ్రామసభల్లో తీర్మానాలు చేయాలని సూచించారు.గ్రామ అవసరాలు,అందుబాటులో ఉన్న...