గ్రామీణ మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి:
గ్రామ పంచాయతీ,గ్రామ సమైక్య,అంగన్వాడీ భవనాల పనులను వేగవంతం చేయాలని మంత్రి సీతక్క ఆదేశం ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామ పంచాయతీ భవనాలు, గ్రామ సమైక్య భవనాలు,అంగన్వాడీ భవనాల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి సీతక్క సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.మంజూరైన భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి, వివిధ శాఖల మధ్య సమన్వయంతో సకాలంలో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా పెండింగ్ పనులను త్వరితగతిన...