ఘనంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు

మునుగోడు సెప్టెంబర్ 27 ప్రజా సంక్షేమం న్యూస్ మునుగోడు ప్రతినిధి మండల పార్టీ అధ్యక్షులు పెంబల్లా జానయ్య ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు మునుగోడు మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది ఈయొక్క కార్యక్రమానికి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ మన భారత ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని 25 సంవత్సరాల ప్రజాసేవ ప్రస్థానం సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది...