చంచల్‌గూడ – సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి:

హైదరాబాద్ ఒరిజినల్ సిటీ (ఓల్డ్ సిటీ) ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తా! ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమం న్యూస్: చారిత్రక హైదరాబాద్ ఒరిజినల్ సిటీ (ఓల్డ్ సిటీ) ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి రాజకీయాలకు అతీతంగా శాయశక్తులా ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు.దేశంలోనే అభివృద్ధి చెందిన అతిపెద్ద నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని అన్నారు.చంచల్‌గూడ నుంచి సంతోష్‌నగర్ వరకు 3.2 కి.మీ.మేర నిర్మించిన స్టీల్ఫ్లై...