PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 4:28 pm Posted by : Praja Sankshemam News

చండూరు మండల ప్రజావాణి లో 18 దరఖాస్తులు…

ప్రజాసంక్షేమం న్యూస్-చండూరు
ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో మొత్తం 18 దరఖాస్తులు వచ్చినాయి అని ప్రజావాణి నోడల్ అధికారి ఎంపీడీవో బి యాదగిరి గారు తెలియజేశారు.అందులో మూడు సాధారణ దరఖాస్తులు, ఒకటి రెవెన్యూ శాఖ వీఆర్ఏ జాబ్ గురించి.రెండవది మన ఊరు మనబడి లో బిల్లు చెల్లింపు, మూడవది రోడ్డు మధ్యలో కరెంటు పోలు తొలగింపుకు సంబంధించినవి కాగా మిగతా 15 దరఖాస్తులు బీఆర్ఎస్ పార్టీ వారు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్ లపై వంద రోజుల్లో అమలు చేస్తామని వెయ్యి రోజులైనా అమలు చేయకపోవడంపై ప్రతి గ్రామానికి ఒకటి చొప్పున మొత్తం 15 దరఖాస్తులు అందజేసినట్లు తెలిపారు.