ప్రజాసంక్షేమం న్యూస్-చిట్యాల:
చిట్యాల మండలం,పిట్టంపల్లి:కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేడి సైదులు మాతృమూర్తి చంద్రమ్మ మృతి చెందడంతో పలువురు కాంగ్రెస్ నాయకులు ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జడల చిన్న మల్లయ్య,సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కాటం వెంకటేష్,సింగిల్ విండో చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి,సర్పంచ్ అందే అండాలు రాములు,మాజీ సర్పంచ్ నరగోని దుర్గయ్య,అధ్యక్షుడు మేడి కృష్ణయ్య,ఉప సర్పంచ్ నరగోని నాగరాజు,సింగిరెడ్డి అనంతరెడ్డి,దేవరపల్లి నర్సిరెడ్డి తదితరులు చంద్రమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం మేడి సైదులు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.