PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 1:24 pm Posted by : Praja Sankshemam News

చాకలి ఐలమ్మగారి వర్ధంతిలో పాల్గొన్న వేముల పుష్పక్క:

ప్రజాసంక్షేమం న్యూస్ – నకిరేకల్
చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా రామన్నపేట పట్టణంలోని మెయిన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ప్రజా గాయని,ఉద్దీపన ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ శ్రీమతి వేముల పుష్పక్క గారు.ఈ సందర్భంగా పుష్పక్క గారు మాట్లాడుతూ.తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడి,భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా గళమెత్తిన వీరనారి చాకలి ఐలమ్మ గారని కొనియాడారు.పేదలు,బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని,ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.