PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 11:45 am Posted by : Praja Sankshemam News

చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

ప్రజాసంక్షేమం న్యూస్
చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఉరుమడ్ల గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ధైర్యంగా నిలబడి, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ గారు మహిళా శక్తికి,ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు.పేదలు, రైతులు,మహిళల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఐతరాజు నరసింహ,చెరుకు సైదులు,గుత్తా రవీందర్ రెడ్డి, నడపరాజు వెంకటరమణ, చెరుకు శంకర్, చెరుకు యాదమ్మ, వనం మంజులతో పాటు పలువురు మహిళలు, గ్రామస్థులు పాల్గొని చాకలి ఐలమ్మ గారికి నివాళులర్పించారు.