చిత్రియాల పునరావాస రైతుల హక్కులను కాపాడాలి: PRPS రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి

చందంపేట (ప్రజాసంక్షేమం న్యూస్): నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం, చందంపేట మండలం చిత్రియాల రెవెన్యూ పరిధిలోని 206 సర్వే నంబర్‌లో పునరావాసం కింద భూములు పొందిన రైతులకు అన్ని రకాల చట్టబద్ధమైన హక్కులు వర్తింపజేయాలని ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి డిమాండ్ చేశారు. సోమవారం చిత్రియాల,పెదమూల,నల్ల శిలమూల గ్రామాలకు చెందిన బాధిత రైతులతో కలిసి చందంపేట తహసీల్దార్ టి. సత్యనారాయణ గౌడ్‌కు ఆయన వినతిపత్రాన్ని సమర్పించారు. సమస్య నేపథ్యం - 1972 నాటి పునరావాస చరిత్ర: ఈ...