చేనేత సహకార సంఘానికి కొత్త సారథ్యం..!

నూతన చైర్మన్ బల్నే వెంకన్న,డైరెక్టర్లకు ఎమ్మెల్యే వేముల వీరేశం శుభాకాంక్షలు. నకిరేకల్ పట్టణం: చేనేత సహకార సంఘం నూతన చైర్మన్‌గా ఎన్నికైన బల్నే వెంకన్నతో పాటు నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లకు ప్రభుత్వ విప్,నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. చేనేత రంగం అభివృద్ధికి,చేనేత కార్మికుల సంక్షేమానికి సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.నూతనంగా ఎన్నికైన చైర్మన్,డైరెక్టర్లు సంఘం అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి...