రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు…
ప్రజాసంక్షేమం న్యూస్
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయం (STO) లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అకస్మాత్తుగా సోదాలు నిర్వహించారు.బాధితుడి నుంచి రూ. 1,00,000 (లక్ష రూపాయలు) లంచం తీసుకుంటుండగా సంబంధిత అధికారులను ఎసిబి బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు,పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు.ప్రస్తుతం ట్రెజరీ (STO) కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తూ పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు.లంచం డిమాండ్ చేసిన అధికారులపై కేసు నమోదు చేసి, ఎసిబి ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని,ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ఎసిబి అధికారులు సూచించారు.