చేవెళ్ల ట్రెజరీ కార్యాలయంలో ఎసిబి దాడులు…
రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు... ప్రజాసంక్షేమం న్యూస్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయం (STO) లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అకస్మాత్తుగా సోదాలు నిర్వహించారు.బాధితుడి నుంచి రూ. 1,00,000 (లక్ష రూపాయలు) లంచం తీసుకుంటుండగా సంబంధిత అధికారులను ఎసిబి బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.బాధితుని ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు,పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు.ప్రస్తుతం ట్రెజరీ (STO) కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తూ పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు.లంచం డిమాండ్...