జీవో 118తో ఎల్బీనగర్ భూ సమస్యలకు పరిష్కారం:మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
22-A నిషేధిత జాబితా నుంచి విముక్తి.. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ధ్రువపత్రాల పంపిణీ ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా శనివారం జీవో 118 కింద ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఎల్బీనగర్ ప్రాంతంలో జీవో 118 పరిధిలోని దరఖాస్తులను పరిష్కరించి, అర్హులైన లబ్ధిదారులకు హక్కు పత్రాలు అందించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. 22-A నిషేధిత...