జూరాల నీటి విడుదలపై కర్ణాటకతో చర్చలు.. సీఎం రేవంత్‌రెడ్డితో మంత్రులు,ఎమ్మెల్యేల భేటీ

• జూరాలకు నీటి విడుదలపై కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు • ఈ సాయంత్రం బెంగళూరుకు మంత్రులు, ఎమ్మెల్యేల బృందం • ఆల్మట్టి–నారాయణపూర్‌ నుంచి నీటి విడుదలపై డీకే శివకుమార్‌తో చర్చ ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్ హైదరాబాద్‌లోని డా.బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, మధుసూదన్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జూరాల ప్రాజెక్టుకు నీటి విడుదల అంశంపై కర్ణాటక ప్రభుత్వంతో జరిపే సంప్రదింపులపై చర్చించారు.కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో...