ప్రజాసంక్షేమం న్యూస్:
ఎన్‌సీఆర్‌బీ డైరెక్టర్ అమిత్ గార్గ్ గారు డీజీపీ కార్యాలయాన్ని సందర్శించి, తెలంగాణలో నేషనల్ క్రిమినల్ అమలు, అలాగే ఐసీజేఎస్ (ICJS), న్యాయ శ్రుతి, న్యాయ సంహిత వంటి అనుబంధ పోర్టళ్ల అమలు తీరును సమీక్షించారు. వివిధ వ్యవస్థల మధ్య సమన్వయం, న్యాయవ్యవస్థ, జైళ్లు, ప్రాసిక్యూషన్, ఫోరెన్సిక్ విభాగాల వంటి వివిధ భాగస్వామ్య సంస్థల పాత్ర, బడ్జెట్‌కు సంబంధించిన అంశాలు, ఢిల్లీ నుంచి అవసరమైన సహాయం, తెలంగాణలో అధునాతన సీసీటీఎన్‌ఎస్ 2.0కు మారడం తదితర అంశాలపై చర్చ జరిగింది. ప్రస్తుతం ఉన్న 34వ ర్యాంకు నుంచి రాబోయే రోజుల్లో మెరుగైన ర్యాంకులకు చేరుకుంటామని డీజీపీ శ్రీ సి.వి.ఆనంద్ గారు అన్నారు. ఇందుకోసం అధికారులందరితో తరచు సమీక్షిస్తూ వేగవంతం చేస్తున్నాని తెలిపారు.