తుమ్మిడిహట్టి బ్యారేజీకి త్వరగా అనుమతులు ఇప్పించాలి.
మహారాష్ట్రతో అంగీకారం కుదిరేలా చొరవ తీసుకోవాలని కేంద్ర జల్‌శక్తి మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి ఢిల్లీ, సెప్టెంబర్ 29: ప్రజాసంక్షేమం న్యూస్: తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరగా అంగీకారం కుదిరేలా చొరవ తీసుకుని అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. మహారాష్ట్ర కోరిన సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సమర్పించిందని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీలో కేంద్ర...