తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 కు ఘనంగా ఏర్పాట్లు:
క్రీడా వేదికలు,వసతి,రవాణా,భద్రతపై మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలి.. క్రీడాకారులకు అత్యుత్తమ వసతులు కల్పించాలి ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్: తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 23 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 పోటీలను ప్రతిష్ఠాత్మకంగా,విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.ఈ నేపథ్యంలో పోటీల ఏర్పాట్లపై సచివాలయంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా పోటీల నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లను శాఖల వారీగా మంత్రి సమీక్షించారు. క్రీడా వేదికల సిద్ధత,...