తెలంగాణలో ప్రత్యేక ఎన్‌ఆర్‌ఐ కమిషన్ ఏర్పాటు చేయాలి!

ప్రజా సంక్షేమం న్యూస్ -హైదరాబాద్: తెలంగాణకు చెందిన విదేశీ ప్రవాసుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ఎన్‌ఆర్‌ఐ కమిషన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్,ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్,టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కోరారు.ఈ మేరకు సీఎంకు వినతిపత్రం అందజేశారు.అమెరికా, గల్ఫ్ దేశాలు,యూరప్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రవాసులు పెట్టుబడులు, రెమిటెన్స్‌లు, సాంకేతికత, విద్య, వైద్యం, దాతృత్వ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నారని వారు పేర్కొన్నారు.అయితే ప్రవాసులు, వారి కుటుంబాలు ఆస్తి, భూ వివాదాలు,...