PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 4:50 pm Posted by : Praja Sankshemam News

తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి అవకాశం ఉన్నా.. ఛత్తీస్‌గఢ్ నుంచి ఎందుకు కొనుగోలు చేశారు?

కమీషన్ల కోసమే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసింది..
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కాంగ్రెస్ నేత చామల కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శలు
ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్
:తెలంగాణలోనే విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ,గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసిందని భువనగిరి ఎంపీ,టీపీసీసీ మీడియా & పబ్లిసిటీ కమిటీ చైర్మన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.విద్యుత్ అవసరాలను రాష్ట్రంలోని ఉత్పత్తి సామర్థ్యంతో తీర్చుకునే అవకాశాలు ఉన్నప్పటికీ,గత ప్రభుత్వం ఇతర రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలుకు మొగ్గు చూపిందని ఆయన విమర్శించారు.“కమీషన్లకు కక్కుర్తి పడి ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశారు”అని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు,వాటి వల్ల రాష్ట్రంపై పడిన ఆర్థిక భారం తదితర అంశాలపై సమగ్రంగా పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.