హైదరాబాద్ (ప్రజా సంక్షేమం న్యూస్):
తెలంగాణ రాజకీయంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖల మంత్రి శ్రీమతి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగిస్తూ (బర్తరఫ్ చేస్తూ) గవర్నర్ భవన్ నుండి అధికారికంగా ప్రెస్ కమ్యూనికేt విడుదల అయింది.తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సూచనల (సిఫార్సు) మేరకు రాష్ట్ర గవర్నర్ గారు శ్రీమతి కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగిస్తూ 2026 సెప్టెంబర్ 3న లోక్ భవన్ (రాజ్ భవన్) నుంచి అధికారిక ఉత్తర్వులను (Press Communique) విడుదల చేశారు.గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంతర్గత వివాదాలు, క్రమశిక్షణా అంశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదంతోనే సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్‌కు సిఫార్సు చేయగా.. గవర్నర్ గారు ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేస్తూ కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం లోక్ భవన్‌లో గవర్నర్‌తో సమావేశమై ఈ ప్రక్రియను పూర్తి చేశారు. దీంతో రాష్ట్ర కేబినెట్‌లో మార్పులు చేర్పులకు దారితీసినట్లయింది.