PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 5:01 pm Posted by : Praja Sankshemam News

తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో రవాణా శాఖ & ఆర్టీసీ విజయాల ప్రగతి బాట!

ప్రజా సంక్షేమం న్యూస్
తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి 1000 రోజులు అవుతున్న సందర్భంగా రవాణా శాఖ & ఆర్టీసీ విజయాలు ప్రగతి
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహా లక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాం.ఇప్పటి వరకు 347.36 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు.12167 కోట్లు ఆదా చేసుకున్నారు.మహిళలు ఆర్థిక వృద్ధి సాధిస్తున్నారు. అనేక మహిళా ప్రయోజనాలు జరిగాయిఅని సర్వేలు చెబుతున్నాయి.దేశంలో మొదటిసారిగా 600 బస్సులకు మహిళలను యజమానులను చేయడం జరిగింది.ప్రతి బస్సుకు 69,468 రూపాయలను emi చెల్లిస్తుండగా నెలకు 4 కోట్లు చెల్లి స్తున్నాం.ఇప్పటి వరకు 29.31 కోట్లు చెల్లించాం.గతంలో 67;శాతం ఉంటే ఇప్పుడు 89 శాతం ఆక్యుపెన్సీ పెరిగింది. ఈవీ బస్సులు,నియామకాలు,కొత్త బస్సుల ,సర్వీసు నుండి రిమూవ్ అయిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.2932 కొత్త బస్సులు కొనుగోలు చేశాం.. 1024 ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలో మరో 2200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి.1424 కారుణ్య నియామకాలు చేపట్టాం.పేద ప్రజలకు లైఫ్ లైన్. దేశంలో ఇండియన్ లైఫ్ లైన్ రైల్వే లాగా ఆర్టీసీ లైఫ్ లైన్ ఎంఎంటీఎస్,మెట్రో ,ఆర్టీసీ సమన్వయం తో లాస్ట్ మైల్ వరకు కనెక్టివిటీ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ పేమెంట్ ట్రిమ్ మిషన్ ల ద్వారా టికెట్ ఇవ్వడం జరుగుతుంది.తార్నాక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అభివృద్ధి చేయడం జరిగింది.ఆర్టీసీ కమికులకు రెండు పీఆర్సీ లు ఇచ్చాం.. 5 డీఏ లు ఇచ్చాం.పెండింగ్ డీఏ లు లేవు యూనియన్ ఎన్నికలు జరుపుతున్నాం.తరువాత విలీనం ప్రక్రియ పూర్తి చేస్తాం ఆర్టీసీ విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి పీఎం డ్రైవ్ కింద హైదరాబాద్ లో ఈవీ బస్సులు నడుపుతున్నం.సర్వీసు నుండి రిమూవ్ అయిన దాదాపు 244 మంది ఉద్యోగులను ప్రత్యేక ఐఏఎస్ కమిటీ ద్వారా తిరిగి తీసుకోవడం జరిగింది..
హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చాం 1400 కోట్ల పన్ను మినహాయింపు ఇచ్చాం.బస్ స్టేషన్ లు ఆధునీకరిస్తున్నాం.పెద్దపల్లి, ఏటూరు నాగారం డిపోలు ఇచ్చాం.Ccs బకాయిలు 1096 కోట్ల నుండి 939 కోట్లకు తగ్గించాం.pf బకాయిలు 2108 కోట్లు నుండి 1710 కోట్లకు తగ్గించాం.Srbs &sbt బకాయిలు 513 కోట్ల నుండి 485 కోట్లకు తగ్గించబడ్డాయి.4538 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం..1000 డ్రైవర్, 743 శ్రామిక ,పోస్టుల నియామకాలు పూర్తయ్యాయి వచ్చే నెలలలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నియామక పత్రాలు అందివ్వడం జరుగుతుంది1500 కండక్టర్ నియామకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఎక్కడ పొరపాటు జరగకుండా పారదర్శకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నియామకాలు చేపట్టాం.240 డీజిల్ బస్సులు రిటైర్ఫిట్మెంట్ చేస్తున్నాం.
హైదరాబాద్ లో ఆటో లను రిటైర్ఫిట్మెంట్ చేయడానికి 1.50 లక్షలు సహాయం అందిస్తుంది.ఆర్టీసీ దేశంలో ఉన్నత స్థానంలోఉంది అంటే క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న డ్రైవర్ కండక్టర్ ల కృషి అభినందనీయం.గోదావరి పుష్కరాలు కు బస్ స్టేషన్లు ఆధునికరిస్తున్నాం.బస్ లు రన్ చేస్తాం.మేడారం జాతర కు విజయవంతంగా బస్ లు రన్ చేశాం.ఆర్టీసీ లో ఎక్కడ వేధింపులు ఉండవద్దనీ రవాణా శాఖ చెక్ పోస్టులు ఎత్తివేసింది.జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ టీం లు పెంచింది Ts నుండి tg గా మార్చుకున్నాం.వాహన & సారథి తీసుకొచ్చాం స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం.గత 10 సంవత్సరాలుగా వాహన సారథి లో చేరనిధి తెలంగాణ మాత్రమే ముఖ్యమంత్రి గారి సూచనలతో చేరాం.ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ లు ప్రారంభిస్తున్నాం.రవాణా శాఖలో 113 amvi లు 50 మంది కానిస్టేబుల్ ,20 మంది జూనియర్ అసిస్టెంట్ ,4 mvi లను నియమించాం.రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.అర్రైవ్ అలైవ్ ద్వారా పోలీస్ శాఖా ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టాం.రహవీర్ స్కీమ్ అమలు చేస్తున్నాం..ప్రమాదం జరిగినపుడు వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేయాలి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం గారు ఎప్పటికప్పుడు రావాల్సిన నిధులు మంజూరు చేస్తున్నారు శాసన సభ నడుస్తున్నప్పుడు అన్ని జిల్లాల ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశాం..వాళ్ళు చాలా సంతృప్తి వ్యక్తం చేశారు.ప్రజా ప్రతినిధులు కొత్త రూట్ లు అడిగితే బస్ లు వేస్తున్నాం హైదరాబాద్ లో 370 కొత్త రూట్ లలో బస్ లు నడిపిస్తున్నాం.గ్రామాల్లో కూడా బస్ రూట్ లు లేని ప్రాంతాల్లో బస్ లు నడిపిస్తున్నాం.దేశంలో నంబర్ 1 గా ఆర్టీసీ రవాణా శాఖ ఎదుగుతుంది మా సిబ్బంది కృషి అధికారుల పనితీరు తో ఆర్టీసీ మరింత అభివృద్ధి చెందుతుంది ప్రతి నెల మంగళవారం కార్మికుల గ్రీవెన్స్ ఏర్పాటు చేశాం..వారి సమస్యలు పరిష్కారం చేస్తున్నాం.ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులతో అధికారుల కమిటీ వేసి విలీన ప్రక్రియ పూర్తి చేస్తాం.. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఇబ్బందులు రాకుండా ఇక్కడ చర్యలు తీసుకుంటున్నాం.ఆర్టీసీ కార్మికుల సంక్షేమం తో పాటు సంస్థ ప్రగతి ను ముందుకు తీసుకుపోతాం.రోడ్ సేఫ్టీ సెస్ రోడ్డు భద్రత కు ఉపయోగించుకునేలా చట్టం చేసుకుని ముందుకు పోతున్నాం.రవాణా శాఖ లో అనేక సంస్కరణలు తీసుకొచ్చినమ్.విభజనలో రెండు రాష్ట్రాలు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటాం.రాత్రి బస్సులు నడుపుతుంటే మహిళలకు రక్షణ ఉంటుందని కోరారు.. కొన్ని రూట్ లలో హైదరాబాద్ లో నైట్ బస్సులు నడుస్తున్నాయి.