తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద!
ప్రజా సంక్షేమం న్యూస్ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా శ్రీమతి నేరెళ్ల శారదను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.అనంతరం నేరెళ్ల శారదను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించారు.ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఈ మేరకు జీఓ ఆర్‌టీ నెం.1290ను సాధారణ పరిపాలన శాఖ జారీ చేసింది.