PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 7:30 pm Posted by : Praja Sankshemam News

దళితులను అవమానించిన BRS తీరుపై దళిత సంఘాల ధర్న:

ప్రజాసంక్షేమం న్యూస్ -హైదరాబాద్:
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని,KCR ఫామ్ హౌస్ వద్ద దళితులు నిరసన వ్యక్తం చేస్తే పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దళిత సమాజాన్ని అవమానించేలా వ్యవహరించడం,అత్యున్నత పదవిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత పదజాలంతో మాట్లాడటం,దళితులు నిరసన తెలిపిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం వంటి చర్యలు అత్యంత దురదృష్టకరమని మండిపడ్డారు.దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి నీచమైన చర్యలను తెలంగాణ సమాజం ఎన్నటికీ సహించదని స్పష్టం చేశారు.రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ సమానత్వం,సామాజిక న్యాయం కోసం నిలబడాలని పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ నాయకులు వెంటనే దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, భవిష్యత్ లో ఇలాంటి అవమానకరమైన చర్యలకు పాల్పడకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.