దళితుల అంగుళం భూమి కూడా ప్రభుత్వం తీసుకోదు:మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
భూ హక్కుల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు విషప్రచారాన్ని నమ్మొద్దు.. రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టండి:మంత్రి పొంగులేటి ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్:దళితులు,గిరిజనుల భూములను లాక్కోవడం ప్రజా ప్రభుత్వ విధానం కాదని, వారి అంగుళం భూమిని కూడా ప్రభుత్వం తీసుకోదని రెవెన్యూ,హౌసింగ్,సమాచార,పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం దళితుల భూ హక్కులకు సంపూర్ణ రక్షణగా నిలుస్తుందని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో భరోసా ఇచ్చారు.సామాజిక న్యాయం,పేదల సంక్షేమం,అణగారిన వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ పాలనలో ప్రధాన ప్రాధాన్యతలుగా...