ప్రజా సంక్షేమం న్యూస్- ప్రతినిధి
ప్రజాస్వామ్యంలో అసెంబ్లీని శాసన సభ్యులంతా ఆలయంగా భావించడం ఆనాయితీ. ఈ శాసనసభ అధిపతి అయిన స్పీకర్ పెద్దన్న పాత్ర పోషించి సభను నడిపిస్తారు. న్యాయమూర్తులకు కోర్టుల పరిధిలో ఎంత అధికారం ఉంటుందో శాసన సభాపతికి అసెంబ్లీలో అధికారం ఉండే విధంగా రాజ్యాంగం హక్కు కల్పించింది. అలాంటి రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని, ఆయన మాతృమూర్తిని కించపరచే విధంగా బీఆరెస్ ఎమ్మెల్సీలు అనుచిత వ్యాఖ్యలు చేయడం చూసి తెలంగాణ సమాజం తలదించుకుంటోంది. ఒక దళిత ప్రతినిధికి స్పీకర్ పదివి కట్టబెట్టి కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తే.. బీఆర్ఎస్ పార్టీ ఆ గౌరవాన్ని దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేయడం గర్హనీయం. తమ పార్టీ ఎమ్మెల్సీలు చేసిన తప్పును ఖండించకపోగా.. ఆ తప్పును సమర్దించే విధంగా బీఆరెస్ నాయకుల తీరు ఉండటాన్ని ఓ మహిళా ప్రతినిధిగా నేను ఖండిస్తున్నాను. అసెంబ్లీ స్పీకర్ తల్లిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దుషించడంతో ఆగకుండా.. అసెంబ్లీ వద్ద డ్యూటీలో ఉన్న మహిళా పోలీసుల పట్ల బీఆరెస్ నాయకులు అసభ్యంగా దాడి చేశారని సదరు మహిళా పోలీసులు మంత్రికి ఫిర్యాదు చేయడం బాధాకరం. అంతటితో ఆగకుండా మళ్ళీ అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామని బీఆరెస్ నేతలు వార్నింగ్ ఇవ్వడం చాలా దారుణం. ఇప్పటికైనా జరిగిన తప్పులను సరిదిద్దుకునే రీతిలో బీఆర్ఎస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు …