దళిత ప్రతినిధికి స్పీకర్ పదివి కట్టబెట్టి కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తే.. బీఆర్ఎస్ పార్టీ ఆ గౌరవాన్ని దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేయడం గర్హనీయం:MLC విజయశాంతి

ప్రజా సంక్షేమం న్యూస్- ప్రతినిధి ప్రజాస్వామ్యంలో అసెంబ్లీని శాసన సభ్యులంతా ఆలయంగా భావించడం ఆనాయితీ. ఈ శాసనసభ అధిపతి అయిన స్పీకర్ పెద్దన్న పాత్ర పోషించి సభను నడిపిస్తారు. న్యాయమూర్తులకు కోర్టుల పరిధిలో ఎంత అధికారం ఉంటుందో శాసన సభాపతికి అసెంబ్లీలో అధికారం ఉండే విధంగా రాజ్యాంగం హక్కు కల్పించింది. అలాంటి రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని, ఆయన మాతృమూర్తిని కించపరచే విధంగా బీఆరెస్ ఎమ్మెల్సీలు అనుచిత వ్యాఖ్యలు చేయడం చూసి తెలంగాణ సమాజం తలదించుకుంటోంది. ఒక దళిత ప్రతినిధికి...