దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ULC దరఖాస్తులకు మోక్షం
అర్హత ఉన్న కేసులను పరిశీలించి క్రమబద్ధీకరించాలని ఆదేశాలు 22A సమస్యలకు ఫాస్ట్‌ట్రాక్ పరిష్కారాలు హైదరాబాద్, సెప్టెంబర్ 27 (ప్రజాసంక్షేమం న్యూస్): దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అర్హత కలిగిన కేసులను నిబంధనల ప్రకారం పరిశీలించి క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.గతంలో ULC కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి జీవోలు జారీ చేసినప్పటికీ వాటి అమలు జరగకపోవడంతో వేలాది దరఖాస్తులు ఏళ్ల...