దసరాలోపు యాదాద్రి థర్మల్‌ పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి:

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు.. జీ-9 బొగ్గు కోసం కేంద్రంతో తక్షణ చర్చలు ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్:దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తిస్థాయి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి విద్యుత్ శాఖపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో యాదాద్రి థర్మల్ కేంద్రం పనితీరుపై సీఎం ఆరా తీశారు. 🔹జీ-9 బొగ్గు కోసం కేంద్రంతో చర్చలు: యాదాద్రి థర్మల్ కేంద్రానికి అవసరమైన జీ-9 గ్రేడ్ బొగ్గు సింగరేణిలో అందుబాటులో...