PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 12:56 pm Posted by : Praja Sankshemam News

నల్గొండకు సరికొత్త రూపం… నూతన బస్టాండ్‌కు ముందడుగు!

ప్రజాసంక్షేమం న్యూస్ -నల్లగొండ
నల్గొండ నగర ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన నూతన బస్టాండ్ నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు .గౌరవ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గారి సహకారంతో, సుమారు రూ.54 కోట్లతో ఆధునిక వసతులు, సుందరమైన రూపకల్పనతో నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టనున్నారు.ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, నల్గొండ నగరానికి మరింత ఆధునిక రూపాన్ని తీసుకురావడంలో ఈ బస్టాండ్ కీలకంగా నిలవనుంది.నల్గొండ నగర అభివృద్ధే మా లక్ష్యం…ప్రజల సౌకర్యమే మా ప్రాధాన్యత! మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గారి సహకారంతో నల్గొండ అభివృద్ధి మరింత వేగంగా ముందుకు సాగుతోంది.అభివృద్ధి దిశగా నల్గొండ…ఆధునిక బస్టాండ్‌తో సరికొత్త రూపం చెందనుంది.