నల్గొండలో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి.
శోభాయాత్రకు శ్రీకారం చుట్టిన కలెక్టర్ బి. చంద్రశేఖర్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు ప్రజాసంక్షేమం న్యూస్-నల్గొండ: జిల్లాలో గణేష్ నిమజ్జనంతో పాటు శోభాయాత్రకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు.బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్‌నగర్‌లోని ఒకటో నంబర్ వినాయక విగ్రహం వద్ద కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గణేష్ శోభాయాత్రను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి...