నల్గొండలో ఘనంగా వినాయక శోభాయాత్ర…
భక్తిశ్రద్ధలతో కదిలిన గణనాథుల ఊరేగింపు.. భారీగా తరలివచ్చిన భక్తజనం! ప్రజాసంక్షేమం న్యూస్-నల్గొండ: వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నల్గొండ పట్టణంలో వినాయక శోభాయాత్రలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి గణనాథుల విగ్రహాలను ప్రత్యేక వాహనాలపై అలంకరించి భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు.శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై బోలో గణేష్ మహారాజ్ అంటూ నినాదాలతో సందడి చేశారు. డప్పులు, భజనలు, ప్రత్యేక అలంకరణలతో ప్రధాన రహదారులు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భక్తులతో కిక్కిరిసిన ప్రధాన రహదారులు: వినాయక శోభాయాత్రను తిలకించేందుకు పట్టణంలోని...