నాగార్జునసాగర్ మేజర్ కాలువకు భారీ గండి!

ప్రజా సంక్షేమం న్యూస్ నల్గొండ జిల్లా అనుమల మండలం  నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని అలవాల సమీపంలో రాజవరం మేజర్ కాలువకు గండి పడి సాగునీరు వృథాగా పోతోంది.ఇటీవలే చెరువులు, కుంటలు నింపేందుకు ప్రభుత్వం విడుదల చేసిన నీరు ఈ గండి వల్ల వృథాగా పారుతుండటంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.