పీఆర్టీయూటీఎస్ నార్కెట్‌పల్లి మండల శాఖ నూతన కార్యవర్గం మర్యాదపూర్వక భేటీ
ఉపాధ్యాయుల సమస్యలు, సంఘం బలోపేతంపై చర్చ
నూతన బాధ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
ప్రజాసంక్షేమం న్యూస్-నకిరేకల్:పీఆర్టీయూటీఎస్ (PRTUTS) నార్కెట్‌పల్లి మండల శాఖ నూతన కార్యవర్గం ఏర్పడిన సందర్భంగా మండల అధ్యక్షుడు,ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు,కార్యవర్గ సభ్యులు గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు.మండల శాఖకు సంబంధించిన పలు అంశాలతో పాటు ఉపాధ్యాయుల సమస్యలు, సంఘం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యేతో చర్చించారు.నూతన కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే వేముల వీరేశం అభినందించి,వారి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.