నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంబించిన MLA,MLC
చండుర్, సెప్టెంబర్ 29 (ప్రజాసంక్షేమం న్యూస్): చందూర్ మండలం జోగుగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండేలా పంచాయతీ పరిపాలనను మరింత బలోపేతం చేయాలని వారు సూచించారు.నూతన పంచాయతీ భవనం ద్వారా గ్రామ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు,ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు.కార్యక్రమంలో చందూర్ ఎంపీడీఓ, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.