న్యాయం జరగకపోతే సచివాలయం ముట్టడి, హైకోర్టులో రిట్ పిటిషన్: JAC రాష్ట్ర కార్యదర్శి బోల్గురి ముకేష్ హెచ్చరిక
ప్రజాసంక్షేమం న్యూస్:హైదరాబాద్ నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొతులారం MPPS పాఠశాల ప్రధానోపాధ్యాయుడు(HM)తోటి ఉపాధ్యాయుల సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు,FRS హాజరు అక్రమాలు,నిధుల గోల్‌మాల్ మరియు విద్యార్థుల పట్ల అనాగరిక ప్రవర్తనకు పాల్పడిన విచారణలో రుజువైనప్పటికీ సదరు HMని కాపాడేందుకు నల్గొండ DEO కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ కార్పొరేట్ విద్య నియంత్రణ JAC &చరణ్యా శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్(DSE) కార్యాలయం ముందు ధర్నా,ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నవీన్ నికోలస్ IAS గారు విదేశీ పర్యటనలో ఉన్నందున...