పారాక్వాట్‌పై ఎంపీ కడియం కావ్య పోరాటానికి ఫలితం – ఇప్పటికే ఉన్న రిజిస్ట్రేషన్లు సైతం రద్దు
గడ్డి మందుపై కేంద్రం కీలక నిర్ణయం పారాక్వాట్ డైక్లోరైడ్ కొత్త రిజిస్ట్రేషన్లకు నిషేధం ఇప్పటికే ఉన్న రిజిస్ట్రేషన్లు సైతం రద్దు హనుమకొండ, సెప్టెంబర్ 29 (ప్రజాసంక్షేమం న్యూస్): రైతులు, గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిన పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు)పై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో లేవనెత్తిన అంశానికి కీలక పరిణామం చోటుచేసుకుంది. పారాక్వాట్ డైక్లోరైడ్‌కు కొత్తగా రిజిస్ట్రేషన్ ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో పాటు, ఇప్పటికే మంజూరైన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది.పారాక్వాట్ వినియోగంతో కలిగే ప్రమాదాలను వివరిస్తూ...